అమెరికాలో సిద్ధిపేట టెక్కీ మృతి
అమెరికాలో ఉంటున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకన్న గారి కృష్ణ చైతన్య అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మూడ్రోజుల క్రితం డలాస్‌లో జరిగింది. కృష్ణ చైతన్య స్వస్థలం సిద్ధిపేటలోని ప్రశాంత్‌నగర్. కాగ్నిజెంట్ కంపెనీలో ఉద్యోగ నిమిత్తం మూడున్నరేళ్ల కిందట కృష్ణ చైతన్య అమెరికా వెళ్లాడు. డల్లాస్‌లోని సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కంపెనీలోకి మూడు నెలల క్రితం ఆయన మారాడు. డల్లాస్‌లోని ఓ ఇంట్లో పెయింగ్ గెస్ట్‌గా ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం తన గది నుంచి ఆయన ఎంతవరకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆ ఇంటి యజమాని పోలీసులకు సమాచారమందించాడు. అక్కడికి వెళ్లిన పోలీసులు గది తలుపుతు తెరచి చూడగా, మంచంపై కృష్ణచైనత్య నిర్జీవంగా పడి ఉండడం గమనించారు. కాగా, కృష్ణచైతన్య మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, అతని మృతదేహాన్ని ఇక్కడికి తరలించే ఏర్పాట్లను మంత్రి హరీష్‌రావు పర్యవేక్షిస్తున్నారని సమాచారం.













