అమెరికాలో తెలుగు వ్యక్తి దుర్మరణం
అమెరికాలో తెలుగు వ్యక్తి దుర్మరణం చెందాడు. సౌత్‌ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ భరత్‌రెడ్డి మృతి చెందాడు. ఈ దుర్ఘటన మూడు రోజుల కిందటే జరిగింది. అయితే భరత్‌రెడ్డి గాయపడినట్లు మాత్రమే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు స్నేహితులు. భరత్‌రెడ్డి మరణం విషయం చెప్పలేక స్నేహితులు సతమతమవుతున్నారు. పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు భరత్‌రెడ్డి. సౌత్‌ఫ్లోరిడాలో ఈ నెల 13న స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేస్తున్న సమయంలో అదపు తప్పి భరత్‌రెడ్డి కిందపడిపోయాడు. అదే సమయంలో అటుగా వస్తున్న ట్రక్కు అతనిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో భరత్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో భారత్ గాయపడినట్లుగానే అతడి కుటుంబసభ్యులకు ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పారు స్నేహితులు. సోదరుడి మరణవార్త తెలిసిన వెంటనే ఆస్ట్రేలియాలో ఉంటున్న భరత్ అన్న అమెరికాకు బయలుదేరినట్లు తెలుస్తోంది.













