ఎన్ఆర్ఐ హత్య కేసులో శిఖా చౌదరికి క్లీన్ చీట్
ఎన్ఆర్ఐ, వ్యాపారవేత్త జయరాం చిగురుపాటి హత్యకేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరికి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ కేసులో 388 పేజీల ఛార్జిషీట్‌ను జూబ్లిహిల్స్ పోలీసులు దాఖలు చేశారు. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్టు సమాచారం. ఈ కేసులో మొత్తం 70 మందిని ప్రశ్నించగా.. ఛార్జిషీట్లో రాకేశ్, శ్రీనివాస్, సినీనటుడు సూర్యప్రసాద్, కిశోర్, విశాల్, నగేశ్, అంజిరెడ్డి, సుభాష్ రెడ్డి పేర్లు నమోదు చేసినట్టు తెలుస్తోంది. జయరాం జనవరి 31న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో తన కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అక్కడ కేసు విచారణ అనంతరం.. కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి జూబ్లీహిల్స్ ఠాణాకు బదిలీ చేశారు.













