మిషన్ భగీరథ పనులను చూసిన ఎన్నారైలు
తెలంగాణ ముఖ్యమంత్రి చేపట్టిన మిషన్ భగీరథ మంచినీటి పథకంను ఎన్నారైలు పరిశీలించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన వివిధ దేశాలకు చెందిన ప్రవాసులు ముఖ్యమంత్రి కేసీఆర్ కొరిక మేరకు గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధిని తిలకించారు. మిషన్ భగీరథ పథకం కింద గజ్వేల్ నుండి 14 మండల్లాలోని 590 గ్రామాలకు వాటర్‌షెడ్ పథకం ద్వారా గోదావరి ద్వారా అందిస్తున్న మంచినీటి పథకాన్ని పరిశీలించారు. ఒకేచోట నుండి పెద్దేత్తున గ్రామాలకు నీటిని పైపులైన్ల ద్వారా పంపించడం విశేషమని అధికారులు వివరించారు. అనంతరం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రబెల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ విడివిడిగా నిర్మించిన 420 డబుల్ బెడ్ రూం ఇళ్లను, గ్రామం అంతటా నిర్మించిన సిమెంటు రహదారులను, భారీ కళ్యాణ మండపాన్ని ప్రవాసులు ఆసక్తిగా తిలకించారు. దానికి సమీపంలోని కేజీ నుండి పీజీ వరకు గ్రామీణ బాలికల కోసం ఏర్పాటు చేసిన ఎడ్యూకేషనల్ హబ్‌ను కూడా సందర్శించారు.
అనంతరం మంత్రి హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేటను సందర్శించారు. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తరహాలో తీర్చిదిద్దిన కోమటి చెరువును పరిశీలించారు. సిద్ధిపేట పరిసర ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం గృహ సముదాయాన్ని మంత్రి హరీష్‌రావు దగ్గరుండి ప్రవాసులకు చూపించారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి, జాయింట్ కలెక్టరు పద్మాకర్ తదితర ఉన్నతాధికారుల బృందం ప్రవాసులకు ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని గురించి వివరించారు. తెలుగు మహాసభల ఎన్ఆర్ఐ కన్వీనర్ మహేష్ బిగాల తదితరుల ఆధ్వర్యంలో ఈ పర్యటన జరిగింది.













