తెరాస మలేషియా ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మరియు తెరాస మలేషియా మొదటి సంవత్సర ఆవిర్భావ దినం సందర్బంగా తెరాస మలేషియా ఎన్నారై విభాగం అధ్యక్షుడు శ్రీ చిరుత చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం మరియు అమరుల ప్రాణ త్యాగఫలం మన సొంత రాష్ట్ర కళ సాకారమై 5 వసంతాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగిడిన శుభసందర్బాన్ని తోటి తెరాస కార్యకర్తలు మరియు ప్రవాసులతో కలిసి వేడుకగా జరపుకున్నారు.
ఈ సందర్బంగా అధ్యక్షులు చిట్టిబాబు మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ఏర్పాటుకు పోరాటప్రతిమను మరియు అమరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో లెనిన్ రెడ్డి గారి ఆద్వర్యంలో జరిగిన పిల్లల సాంస్కృతిక, జానపద నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మలేషియా తెలంగాణ సంఘం అధ్యక్షులు సైదం తిరుపతి మరియు ఉపాధ్యక్షుడు చొపారి సత్య విచ్చేసారు. ఈ సందర్బంగా తిరుపతి గారు మాట్లాడుతూ తెరాస మలేషియా ఏర్పాటు చేసిన గత సంవత్సర కాలంలో చేసిన పలు సేవా కార్యక్రమాలను కొనియాడారు.
తెరాస మలేషియా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు స్పైస్ విజన్ సంస్ధల అధినేత శ్రీ రమేష్ బాబు గారు వారి సహాయసహకారాలు అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, రఘునాత్ నాగబండి, రవిందర్ మరియు ఇతర సభ్యులు పాల్గొనడం జరిగింది.













