న్యూజిలాండ్ లో తెలంగాణ దశాబ్ది వేడుకలు
న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆ దేశ కేంద్ర మంత్రులు మైఖేల్ వుడ్, ప్రియాంకా రాధా కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తక్కువ సమయంలో అద్భుతమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి ప్రియాంకా రాధా కృష్ణన్ అన్నారు. మంచి నాయకత్వ ప్రతిభ తెలంగాణకు ఉందని తెలిపారు. తాను తెలంగాణను సందర్శించిన స్వయంగా చూశానంటూ స్పష్టం చేశారు. మౌంట్ ఈడెన్ వార్ మెమోరియల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం లో జానపద, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.













