టీఏజీహెచ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు

అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 15న గ్రేటర్ హ్యూస్టన్ తెలంగాణ సమితి (టీఏజీహెచ్) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకోవాలని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ భావిస్తోంది. ఈ వేడుకల్లో స్థానిక కమ్యూనిటీ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని టీఏజీహెచ్ కోరుతోంది.