టీజీఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో దసరా, బతుకమ్మ సంబరాలు

అమెరికాలోని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా (టీజీఎఫ్ఎల్) ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 24వ తేదీన జరిగే ఈ వేడుకలను ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలంగాణ సంస్కృతిని మరింత విస్తృతం చేయడానికి టీజీఎఫ్ఎల్ కృషి చేస్తోంది. ఈ క్రమంలో నిర్వహించే బతుకమ్మ సంబరాలకు ఫ్లోరిడాలోని తెలంగాణ బిడ్డలంతా తరలి వచ్చి ఈ వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.