తెలంగాణా అసోసియేషన్ అఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యం లో ఘనంగా బోనాల ఉత్సవాలు
తెలంగాణా అసోసియేషన్ అఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యం లో బోనాల ఉత్సవాలను మియామీ CB Smith Park, ఫ్లోరిడా లో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు పూజలు జరిపి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అధ్యక్షులు చందు తాళ్ల గారు మాట్లాడుతూ బోనాలు పండుగ అన్నది జీవ వైవిధ్యాన్ని సూచిస్తుందని, తెలంగాణా సంస్కృతికి ప్రతీకగ నిలుస్తుందని, ప్రపంచం లో తెలుగు ప్రజలు ఎక్కడున్నా కలుసుకోవడానికి తోడ్పడుతుందని, అంతే కాకుండా మహిళా సాధికారతకు కూడా బోనాలు పండుగ అనేది చిహ్నంగ ఉపయోగపడుతున్ధన్నారు.
స్థానిక ఎగ్జిక్యూటివ్ కమిటి మెంబెర్ మోహిత్ కర్పూరం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. స్వాతి జలగం ఆధ్వర్యములో చక్కని సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రముఖ సంఘసంస్కర్త గుమ్మకొండ రెడ్డి ఫౌండేషన్ ఫౌండర్ శేఖర్ రెడ్డి, శైలజ రెడ్డి మరియు వందలాది మంది స్థానికుల, సహకారంతో మేళ తాళాలతో, తీన్మార్ డాన్సులతో అత్యంత వైభవంగా బోనాలను ఊరేగించారు. నిర్వాహకులు పిల్లల కోసము ప్రత్యేకంగా ఏర్పర్చిన పోనీ రైడ్స్ కార్యక్రమం ఆకర్షణ గా నిలిచింది. రాజు భాషా బోయిన, ప్రతిభ రాజు ప్రాంగణాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు.
కార్యక్రమానికి తెలంగాణ అసోసియేషన్ అఫ్ ఫ్లోరిడా అధ్యక్షులు చందు తాళ్ల, మోహిత్ కర్పూరం, శేఖర్ రెడ్డి, శైలజ రెడ్డి, Dr.రాజేందర్ రెడ్డి చెరుకు, దేశిక చెరుకు, శశి గుడాల, నిరుపమా రెడ్డి, శరత్ కొత్తకాపు, శ్యామా మార్గని, వీణ తల్లా, శ్వేతా, సునీల్, రాజేందర్ రెడ్డి బెక్కరి, రాజ్ సారెడ్డి, అనిల్ ఆది, రవి అండపల్లి, లష్మికాంత్ కళ్ళం, షర్మిల, ఉపాధ్యక్షులు అవినాష్ రామ, స్వాతి జలగం, రవి వుమ్మగోని, అనిల్ బండారం, శ్రీనివాస్ గడ్డం, అశోక్ వర్ధన్, లతా రెడ్డి, సంతోష్ గూడూరు, Dr. శ్రీనివాస్ దొంతినేని, నరేందర్ కొమ్మ, శ్రీనివాస్ముతినేని, వెంకట్ కంచర్ల, శ్రీకాంత్ జలగం పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి లతారెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దాతలకు మరియు అమెరికన్ తెలంగాణ అస్సోసియేషన్ సంస్థకు కృతజ్ఞతలు తెలియపరిచారు.













