TTA: టిటిఎ సేవలను ప్రశంసించిన మంత్రి సీతక్క
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మహిళా ఫోరం వుమెన్స్ డే వర్చువల్ ఈవెంట్’ కార్యక్రమాన్ని మార్చి 9వ తేదీన వైభవంగా నిర్వహించింది. ఆయా రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించిన పలువురు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క(Seethakka) పాల్గొన్నారు. సమాజంలో మహిళా సాధికారత కోసం తను చేసిన ప్రయత్నాలను, తన ప్రయాణాన్ని ఆమె ఈ సందర్భంగా వివరించారు. టిటిఎ అమెరికాలోనూ, ఇండియాలోనూ కమ్యూనిటీకి చేస్తున్న సేవలను ప్రశంసించారు. అలాగే ఐపీఎస్ అధికారిణి సుమతి బడుగుల, వీ హబ్ సీఈవో సీత పల్లచోల్ల ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా పాల్గొని మాట్లాడారు. తమ తమ రంగాల్లో తాము చేసిన సేవను వీరు వివరించారు. ఈ సందర్భంగా తమకు ఎప్పుడూ మద్దతుగా నిలిచిన టీటీఏ పెద్దలకు మహిళా ఫోరం ధన్యవాదాలు తెలిపింది. ప్రత్యేకంగా టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, అడ్వైజరీ కమిటీ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, కో-చైర్ డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల, కమిటీ మాజీ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల, సభ్యులు భరత్ రెడ్డి మాదడి, శ్రీని అనుగు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డరెక్టర్స్, స్టాండిరగ్ కమిటీ, రీజనల్ వైస్ ప్రెసిడెంట్లు తదితరులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలను మహిళా నాయకులు తెలియజేశారు.
మహిళా సాధికారతకు టీటీఏ ఎంత ప్రాముఖ్యతనిస్తుందో ఈ కార్యక్రమమే చెప్తుందని మహిళా ఫోరంనాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ సంప్రదాయాలను, అంతర్జాతీయంగా తెలుగు మహిళల ప్రభావాన్ని తెలియజేస్తుందని, భవిష్యత్తులో మరింతమంది మహిళలు లీడర్లుగా ఎదగడానికి స్ఫూర్తినిస్తుందని టీటీఏ మహిళా ఫోరం తెలిపింది. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మహిళా కమిటీ ఫోరంలోని సభ్యులు.. మహిళా కమిటీ అడ్వైజర్ పల్లవి రెడ్డి రమిడి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కవితా రెడ్డి, మీడియా మరియు కమ్యూనికేషన్స్ డైరెక్టర్ దీపికా రెడ్డి నల్ల, జనరల్ సెక్రటరీ శివారెడ్డి కొల్ల, జాయింట్ సెక్రటరీ నిశాంత్ సిరికొండ, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నర్సింహా పేరుక, డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రవీణ్ చింత, సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, వెబ్ కమిటీ సభ్యులు నరేందర్ రెడ్డి యారవ, షార్లట్ టం లక్ష్మీకాంత్ రమిడి, రమేష్ చింతకుంట్ల తదితరులకు టిటిఎ పెద్దలు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.







