షార్లెట్‌లో టిటిఎ అలయ్ బలయ్ జాతర
తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) ఆధ్వర్యంలో టిటిఎ ఫౌండర్ డా పైళ్ల మల్లారెడ్డి అశీసులతో, అడ్వైజరీ చైర్ డా విజయపాల్ రెడ్డి, అడ్వైజరీ కో చైర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల, మెంబెర్ భరత్ మాదాడిలు మొట్ట మొదటిసారిగా తెలంగాణకి ప్రీతీ పాత్రమైన బోనాలు మరియు అలయ్ బలయ్ జాతరను వివిధ నగరాల్లో జరపాలని నిర్ణయించారు. ప్రెసిడెంట్ వంశీ రెడ్డి అధ్యక్షతన జరిగిన టిటిఎ అలయ్ బలయ్ కు వివిధ నగరాలలో జనం పెద్ద ఎత్తున పోటెత్తారు.
టిటిఎ, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది స్వంత నగరమైన షార్లెట్ లో అలయ్ బలయ్ జాతర సంబురాలు అంబరాన్ని అంటాయి. మీడియా కమ్యూనికేషన్ డైరెక్టర్ నిశాంత్ సిరికొండ మరియు బోర్డు అఫ్ డైరెక్టర్ శ్రీకాంత్ గాలి నేతృత్వంలో టిటిఎ షార్లెట్ టీం మార్విన్ ఎఫైర్డ్ పార్క్ నందు శనివారం నిర్వహించిన సంబురాలు నాలుగు వందల మంది ఆహుతులతో కిక్కిరిసింది. విచ్చేసిన వారందరు సంస్కృత కార్యక్రమాలు మరియు అట పాటల తో అలయ్ బలయ్ చేసుకున్నారు. వచ్చిన వారికి టిటిఎ చార్లొట్ వాలంటీర్లంతా చక్కని విందు భోజనం ఏర్పాటు చేశారు. టిటిఎ చార్లొట్ టీం అంకుష్, అరుణ్, ఆహ్లద రెడ్డి, దిలీప్, రాఘవేంద్ర, ప్రవీణ్ రెడ్డి, భరత్, అభి, శరన్, నరేన్, భరద్వాజ్ దీప్తి, రమేష్ వచ్చిన వారి అందరికి ధన్యవాదాలు తెలియచేసారు.













