టీనేజ్ బాలికల్లోనే నైరాశ్యం ఎక్కువ!
అబ్బాయిల కంటే టీనేజ్ అమ్మాయిలే ఎక్కువగా బెదిరింపులకు పాల్పడతారని, నైరాశ్యంలో కూరుకుపోయి ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేస్తారని అమెరికాలోని రుట్జెర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. అమెరికాలో 2011-2015 మధ్య కాలంలో నిర్వహించిన సర్వేను వారు విశ్లేషించారు. బెదిరింపు ధోరణి అనేది నిరాశ, ఆత్మహత్యాయత్నం వంటి వాటితో సంబంధం కలిగి ఉంటుందని వారు తెలిపారు. బాలుర కంటే టీనేజ్లో ఉన్న బాలికలే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడతారని తమ అధ్యయనంలో గుర్తించామని, అయితే ఆత్మహత్యాయత్నం చేసి చనిపోయిన వారిలో మాత్రం బాలురే ఎక్కువగా ఉన్నారని పరిశోధకుల్లో ఒకరైన నాన్సీ పోంటెస్ తెలిపారు.













