భారతీయ ఐటీ నిపుణులకు ఎదురు దెబ్బ
భారతీయ ఐటీ నిపుణులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హెచ్1బీతోపాటు వివిధ రకాల విదేశీ వర్క్ వీసాలను ఈ ఏడాది చివరి వరకూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఇవి నేటి నుంచి ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు అమల్లో ఉంటాయి. గ్రీన్‌కార్డుల జారీని నిలిపి వేస్తూ అమెరికాకు చట్టబద్ధంగానే రావాలంటూ ఇమిగ్రేషన్ ప్రకటనపై ఏప్రిల్‌లోనే ట్రంప్ సంతకం చేశారు. దాని గడువు జూన్ 22న ముగిసిపోనుంది. దానికి కొత్తగా ఎల్ 1 (ఇంట్రా కంపెనీ బదిలీలు), హెచ్ 4 (స్పాజ్ వీసాలు), హెచ్2బీ (తాత్కాలిక వ్యవసాయేతర వర్కర్లు) జే1 (ఎక్స్చేంజ్)వీసాలను జోడిస్తూ ఈ ఏడాది చివరి వరకు పొడిగింది. ట్రంప్ తాజా నిర్ణయంతో కొత్తగా 5.25 లక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని శ్వేతసౌధం ఒక ప్రకటనలో తెలిపింది.













