హెచ్-1బీ జీవిత భాగస్వాములనూ అనుమతించాలి
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములను హెచ్-4 వీసా కింద ఉద్యోగాలు చేసేందుకు అనుమతించాలని అమెరికా ప్రభుత్వానికి ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్‌తో పాటు పలు ఐటీ దిగ్గజ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఐటీ పరిశ్రమ మండలి, అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్, బీఎస్ఏ (ది సాప్ట్ వేర్ అలయెన్స్) తదితర సంఘాలు అమెరికా సిటీజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ లీ ఫ్రాన్సిస్ సిస్నాకు లేఖ రాశాయి. గ్రీన్‌కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు పని చేసేందుకు ఒబామా హయంలో అమలుచేసిన హెచ్-4 విధానాన్ని కొనసాగించాలని ఆ లేఖలో పేర్కొన్నాయి.













