ఉపాధ్యాయులకు తుపాకులు : అమెరికా
పాఠశాలల్లో నరమేధాలు పునరావృతం కాకుండా చూసేందుకు గాను శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు తుపాకులు సమకూర్చాలంటూ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరపైకి తెచ్చిన ఆలోచన కార్యారూపందాలచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది ఉపాధ్యాయులకు ఆయుధాలు అందించి, వినియోగంపై శిక్షణనిచ్చేందుకుగాను ప్రభుత్వం నిధులు సమీకరించే అవకాశముందని శ్వేతసౌధవర్గాలు వెల్లడించాయి. తుపాకులను కలిగి ఉన్న ఉపాధ్యాయులకు రూ.67 వేల చొప్పున బోనస్ ఇస్తే, 10 లక్షల మందికి గాను రూ.6,700 కోట్లు ఖర్చువుతాయని పేర్కొన్నాయి. పాఠశాలల భద్రత కోణంలో చూస్తే అది పెద్దమొత్తమేమీ కాదని అభిప్రాయపడ్డాయి. ఈ మేరకు శాసన బడ్జెట్ సంబంధిత ప్రతిపాదనలపై కాంగ్రెస్ సభ్యులతో ట్రంప్ త్వరలోనే మాట్లాడతారిన తెలిపాయి. ఉపాధ్యాయులకు ఆయుధాలు సమకూర్చాలన్న ఆలోచనను ట్రంప్ పునరుద్ఘాటించారు. పాఠశాలల భద్రతపై అధికారవర్గాలతో శ్వేతసౌధంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో తుపాకులు లేకపోవడంతో హంతకులు సులభంగా లోనికి ప్రవేశించి మారణహోమాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.













