టెక్సాస్‌లో విద్యా బోధనకు ఉపాధ్యాయులకు అవకాశం
అమెరికాలోని టెక్సాస్‌లోని వివిధ పాఠశాలల్లో ఆంగ్లం, స్పెషల్ ఎడ్యుకేషన్ బోధించేందుకు అవసరమైన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షులు మేడపాటి వెంకట్ ఒక ప్రకటనలో తెలిపింది. బీఈడీ లేదా ఎంఈడీ కలిగి ఉండి, అయిదు సంవత్సరాలు భోధన రంగంలో అనుభవమున్నవారు, కళాశాల లెక్చరర్లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అక్కడ ప్రస్తుతానికి 50 మంది గణితం, సైన్సు, ఆంగ్లం, స్పెషల్ ఎడ్యుకేషన్ బోధించే ఉపాధ్యాయులు అవసరముండగా, మొదటి దశలో సైన్సు బోధించే ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ క్రమంలో మొత్తం 96 మందికి అర్హత పరీక్ష నిర్వహించగా, పది మందికి కాల్ లెటర్స్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంగ్లం, స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
ఉపాధ్యాయులు వీసీ ప్రాసెస్ కొరకు టోఫెల్ పరీక్షలో ఉత్తీర్ణత కావాల్సి ఉంటుంది. ఎంపికైన ఉపాధ్యాయులకు మూడు సంవత్సరాల గడువుతో జే1 వీసాను జారీ చేస్తారు. అలాగే ఎంపికైన వారు టెక్సాస్ వెళ్లే ముందుకు వారికి అక్కడ బోధనా పద్ధతులు, నియమనిబంధనల గురించి ఏపీఎన్ఆర్టీఎస్ కార్యాలయంలో రెండు వారాల పాటు అక్లెమ్ గ్లోబల్ ఇండియా ప్రతినిధులు శిక్షణ ఇస్తారని ఆ సంస్థ పేర్కొంది.













