ఘనంగా జరిగిన డల్లాస్ లో తెలుగుదేశం మహానాడు
అమెరికా మొట్టమొదటి తెలుగుదేశం మహానాడు డల్లాస్ లో ఘనంగా ప్రారంభం. మొదటి రోజు అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిలుగా మంత్రి గంటా శ్రీనివాస్, ఎంపీ సిఎం రమేష్, టిటిడి బోర్డు సభ్యులు ఇ. పెద్దిరెడ్డి కనిగిరి ఏమ్మెల్యే కదిరి బాబురావు, గుంటూరు మాజీ జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం, గుంటూరు జడ్పీ Vice చైర్మన్ పూర్ణ చంద్ర రావు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జైరాం, NR తెలుగు దేశం ముఖ్య నాయకులు సతీష్ వేమన, మోహన్ కృష్ణ మన్నవ పాల్గొని సభని ఎంతో విజయవంతం చేసారు. డల్లాస్ కార్యకర్తలతో పాటు అమెరికా రాష్ట్రాల నుంచి దాదాపు 1500 మంది తెలుగు దేశం కార్యకర్తలు హాజరు అయ్యి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు ఘనం గా నిర్వహించారు. పలువురు తెలుగు దేశం కార్యకర్తలు తీర్మానాలు ప్రతిపాదించి నాయకుల సమక్షం లో ఆమోదించారు. నాయకులూ మాట్లాడుతూ డల్లాస్ నగరం అద్భుతం గా ఈ మహానాడు ని నిర్వహించిన కార్యకర్తలను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీలను అమలు పరచాలని కోరారు. చివరగా సంగీత విభావరి ఆహుతులను ఎంతగానో అలరించింది.













