మహానాడు కోసం శ్రమిస్తున్న ఎన్నారైలు
ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను అమెరికాలోని వివిధ నగరాల్లో క్రమం తప్పకుండా తెలుగువారు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం అమెరికాలోని ప్రవాసాంధ్రులందరూ కలసి డల్లాస్ మహానగరం లో మే 27, 28 తారీఖుల్లో ”అమెరికా మహానాడు” నిర్వహించాలని అనుకున్నారు. ఇందులో భాగంగా వందలాది కార్యకర్తలు స్వచ్చందంగా ముందుకు వచ్చి వివిధ విభాగాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ మహాసభలకి తెలుగు రాష్ట్రాలనుండి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, అనేకమంది ప్రముఖ పార్టీ నాయకులు, అమెరికాలోని వివిధ రాష్ట్రాలనుండి తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు అతిథులుగా విచ్చేస్తున్నారు. సభా జరిగే ప్రదేశానికి ఎన్టీఆర్ ప్రాంగణం గా నామకరణం చేసారు. ఈవేదిక నుంచి వివిధ తీర్మానాలు చేసి పార్టీ ఆఫీస్ కి పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.













