పోర్ట్ ల్యాండ్ లో ఘనంగా వనభోజనాల కార్యక్రమం
అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో అట్టహాసంగా వజభోజనాల కార్యక్రమం జరిగింది. రుచికరమైన తెలుగు వంటకాలతో ఆట పాటలతో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫ్రొఫెసర్ జయశంకర్‌కి చాప్టర్ చైర్మన్ శ్రీని అనుమాండ్ల నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ వనభోజన కార్యక్రమానికి పోర్ట్‌ల్యాండ్ మెట్రో సిటీ నుంచి పెద్ద ఎత్తున ఎన్నారైలు తరలివచ్చారు. ఈ సందర్భంగా టీడీఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతితో పాటు సర్టిఫికేట్ ఆఫ్ అవార్డ్స్‌ను చాప్టర్ చైర్మన్ అందించారు. అనంతరం పుడ్ కమిటీ తయారు చేసిన రుచికరమైన తెలుగు వంటకాలతో చిన్నా పెద్ద అంతా కలిసి భోజనం చేశారు. మహిళలు, పిల్లలు, యువకులు, యువదంపతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్ అందరికీ శ్రీని కృతజ్ఞతలు తెలిపారు.













