కరోనా కట్టడికి సహకరిస్తాం… TDF USA అధ్యక్షురాలు కవితా చల్లా
తెలంగాణలో కరోనా వైరస్ కట్టడికి తమవంతు సహకారాన్ని అందిస్తామని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అమెరికా అధ్యక్షురాలు కవితా చల్లా తెలిపారు. తెలంగాణలో కరోనా కేసులో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విషయమై ఆమె మాట్లాడుతూ, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో పెద్దఎత్తున వ్యాపిస్తోందని, ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా వైరస్ కట్టడికి తీసుకున్న చర్యలకు అందరూ మద్దతు పలకాలని ఆమె కోరుతూ, మరోవైపు తమవంతుగా అందరూ కరోనా వైరస్ ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తరపున కూడా ప్రభుత్వానికి అవసరమైన మద్దతును, సహకారాన్ని అందిస్తామని చెప్పారు. అన్నీ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగసంఘాలు ఇలా అందరూ చేయూతనిస్తే ఈ మహమ్మారిని అరికట్టవచ్చని కవితా చల్లా తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ, ఈ వైరస్ కట్టడికి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.













