అమరసైనికులకు టీడిఎఫ్ శ్రద్ధాంజలి
చైనా సైన్యంతో తలపడి దేశం కోసం ప్రాణాలు అర్పించిన 20 మంది భారత సైనికులకు అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ నివాళులర్పించింది. చైనాతో పోరాడి అమరుడైన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబుకు సెల్యుట్ చేస్తున్నట్లు టీడీఎఫ్ అమెరికా అధ్యక్షురాలు కవితా చల్లా అన్నారు. ఒక్కడే కొడుకైనప్పటికీ దేశ రక్షణ కోసం సైన్యంలో చేరే విధంగా ప్రోత్సహించిన సంతోష్ బాబు తల్లిదండ్రులకు, కుటుంబానికి డీటీఎఫ్ తరపున ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కల్నల్ సంతోష్ బాబు యావత్ దేశానికే గర్వగారణంగా నిలిచారని కవితా చల్లా పేర్కొన్నారు













