వాషింగ్టన్ డీసీలో టీడీఎఫ్ 20వ వసంతాల వేడుకలు
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) 20 వసంతాల వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైఎస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బిజినెస్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇరిగేషన్, ఐటీ పారిశ్రామిక రంగాల్లో దేశంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న తెలంగాణలో అంతర్జాతీయంగా అనేక వ్యాపారాలకు మెరుగైన అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రాంతంలో వాతావరణం సమశీతోష్ట స్థితి కలిగిఉందని, ఇది ఏ రంగానికైనా ఎంతో అనువైనదని తెలిపారు. తెలంగాణలో టీ-హబ్ వంటి అనేక ఇన్నోవేటివ్ కార్యక్రమాలు అమలవుతున్నాయని వెల్లడించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణాగా మార్చేందుకు సీఎం కేసీఆర్ నిరంతరంగా కృషి చేస్తున్నారని అన్నారు. టీడీఎఫ్ 20 ఏళ్ల విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.













