టీసీఎస్ కు అమెరికా కోర్టులో ఊరట
భారత్‌కు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్‌కు అమెరికా కోర్టులో ఊరట లభించింది. అమెరికాలో టీసీఎస్ శాఖ దక్షిణాసియాయేతర ఉద్యోగుల్ని జాతి వివక్షతో తొలగించిందని మాజీ ఉద్యోగులు కాలిఫోర్నియా కోర్టులో దావా వేశారు. విచారణ జరిపిన జ్యూరీ టీసీఎస్‌పై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. టీసీఎస్ ఎలాంటి జాతి వివక్ష చూపలేదని వెల్లడించింది. జ్యూరీలోని తొమ్మిది మంది సభ్యులు ఏకగ్రీవంగా టీసీఎస్‌కు మద్దతిచ్చారు. ఉద్దేశపూర్వకంగా కంపెనీ జాతివివక్ష చూపలేదని వెల్లడించారు. కోర్టు టీసీఎస్‌పై ఆరోపణలను తోసిపుచ్చడం భారత ఐటీ ఔట్సోర్సింగ్ రంగానికి లభించిన గొప్ప విజయంగా నిపుణులు అభివర్ణించారు.













