టీసీఏ ఆధ్వర్యంలో కాలిఫోర్నియా వేదికగా వైభవంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ ఆడపడుచులు అత్యంత ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని శాన్ రామన్ ప్రాంతంలో అక్టోబర్ 1న, ఆ మరుసటి రోజున సన్నివాలిలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. వందలాది మంది తెలుగు వారు ఇక్కడకు చేరుకొని బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాన్ఫ్రాన్సిస్కోలో కాన్సుల్ జనరల్‌గా ఉన్న డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, ఆయన సతీమణి పద్మ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. భారత్, అమెరికా దేశాల మధ్య బలమైన బంధాలకు ఇలాంటి వేడుకలు కూడా కారణమని కొనియాడారు. అమెరికాలో కూడా భారత సంప్రదాయాలను కొనసాగిస్తున్న తెలుగు ప్రజలను, భారతీయులను మెచ్చుకున్నారు. ప్రకృతిలో లభించే పూలను, ప్రజలను అందరికీ ఒకచోటకు చేర్చడమే బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని వివరించారు. వీళ్లతోపాటు శాన్ రామన్ మేయర్ డేవ్ హడ్సన్, వైస్ మేయర్ శ్రీధర్ వెరోస్, కౌన్సిల్ మెంబర్ సబీనా జాఫర్, పార్కుల కమిషనర్ హైడీ ఎలికాట్ పేసిక్ తదితరులు కూడా ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు శ్రీనివాస్ గుజ్జు, ధనుంజయ బోడ, మహిపాల్ అన్నం, వినోయ్ మెరెడ్డీ, సాగర్ కొత్త, గోపికృష్ణ గౌరిశెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టాప్-5లో నిలిచిన బతుకమ్మలకు బహుమతులు కూడా అందజేశారు.
టిసిఎ అడ్వయిజరీ కమిటీ సభ్యులు విజయ్ చవ్వా, బిక్షం పాలబిందెల, చంద్రకళ శ్రీరామదాస్, భాస్కర్ మద్ది తదితరులు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
టిసిఎ వలంటీర్లు మధు, వెంకట్, భాస్కర్, అశోక్, కిషన్ రెడ్డి, శ్రీనివాస్, భీమ్, వంశీ, శ్రీనివాస్ మద్దినేని, విష్ణు, చందర్, ప్రవీణ్, సుధీర్, రాంబాబు, సతీష్, కరుణాకర్ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. ఈ కార్యక్రమానికి స్పానర్లుగా వ్యవహరించిన అందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. సాగర్ కోత రియల్టర్, విజేత స్వగృహ ఫుడ్స్ (శ్రీనివాస్), లూన్స్ కాన్సెప్ట్, నితిన్ ఖన్నా (హోం లోన్స్), స్మార్ట్ అకౌంటింగ్ అండ్ టాక్సెస్, రాజా స్వీట్స్, ప్యారడైజ్ బాల్ రూమ్స్, ఎలిజెంట్ ఈవెంట్స్ అండ్ డెకర్, ది షేడ్ హోమ్, సిలికాన్ ఆంధ్ర మనబడి, సార్ టెక్ తదితర సంస్థలకు కూడా నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.













