ఆత్మకూరులో పేదలను ఆదుకుంటున్న వంశీ రెడ్డి
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు అమెరికాలో ఉంటున్న క్వాడ్రంట్ ఐటి సొల్యూషన్స్ అధినేత, తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి ముందుకు వచ్చారు. ఆత్మకూరు మండలంలో ఉన్న పేదలకు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టామని వంశీరెడ్డి తెలుగు టైమ్స్ న్యూస్ ఎడిటర్ గోవిందరాజన్తో మాట్లాడుతూ చెప్పారు. తమ కుటుంబసభ్యులతోపాటు, తమ కంపెనీ సిబ్బంది శ్రీకాంత్‌రెడ్డి కొంకీశ, మధుకర్ రెడ్డి నిరుపేదలకు కూరగాయలను పంపిణీ చేశారని తెలిపారు. మరింతగా పేదలను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టినట్లు వంశీ చెప్పారు. ఈ సమయంలో అందరూ ఇంట్లోనే ఉండి కరోనా వైరస్ బారినపడకుండా ఉండాలని కోరారు.













