బే ఏరియాలో టాటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ – దసరా సంబరాలు
బే ఏరియాలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) ఆధ్వర్యంలో అక్టోబర్ 18వ తేదీన బతుకమ్మ పండుగ వేడుకలను, దసరా సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. సంప్రదాయపండుగ అయిన బతుకమ్మను ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో పెరట్లో నిర్వహించడం ద్వారా కొత్త సంప్రదాయానికి టాటా తెరతీసింది. కోవిడ్ కారణంగా ఏ పండుగను, వేడుకలను చేసుకోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో టాటా అధ్యక్షుడు భరత్ మదాది బ్యాక్‌యార్డ్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించాలన్న ఆలోచన అందరికీ నచ్చింది. ప్రెసిడెంట్‌తోపాటు ఇసి టీమ్ కలిసి ఈ వేడుకలకు ఏర్పాట్లు చేసింది. బే ఏరియాలో నిర్వహించిన ఈ వేడుకలు విజయవంతమయ్యాయి. ఈ కోవిడ్ మహమ్మారి తొలగిపోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజిస్తూ టాటా బే ఏరియా టీమ్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించుకున్నారు.
టాటా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ మానాప్రగడ ఆధ్వర్యంలో, బే ఏరియా రీజీనల్ వైస్ ప్రెసిడెంట్ సరస్వతీ వరకూర్, రీజినల్ కో ఆర్డినేటర్లు నందాదేవి శ్రీరామ, నిత్యశ్రీ కెఎస్, స్టాండింగ్ కమిటీ చైర్ ప్రసాద్ ఉప్పలపు, కమ్యూనిటీ సర్వీసెస్ కో చైర్ రవి నేతి, రీజినల్ కో ఆర్డినేటర్ సొహైల్ అహ్మద్ ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేశారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. నిత్యశ్రీ కెఎస్, విజయ మంత్రాలను పఠిస్తూ, దుర్గాదేవి పూజ, గౌరీదేవి పూజను నిర్వహించారు. తరువాత మహిళలు సంప్రదాయ బతుకమ్మ నృత్యం చేశారు. వేడుకలు జరిగిన ప్రాంతాన్ని అందంగా అలంకరించారు. నందాదేవి శ్రీరామ మాట్లాడుతూ, వేడుకలను జరుపుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ వేడుకలను విజయవంతం చేయడానికి సహకరించిన టాటా పెద్దలు డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డికి, అడ్వయిజరీ కౌన్సిల్ చైర్ విజయ్‌పాల్ రెడ్డి, కో చైర్ డా. హరనాథ్ పులిచెర్ల, అడ్వయిజరీ మెంబర్ మోహన్ పాటలోళ్ళతోపాటు ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సరస్వతి వరకూర్ ధన్యవాదాలు చెప్పారు. బే ఏరియా టాటా టీమ్‌ను ప్రోత్సహిస్తున్న శ్రీనివాస్ మానాప్రగడకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. ఫుడ్ ఏర్పాట్లను రవినీతి, ప్రసాద్ ఉప్పలపు, ప్రార్థన, పూజ, బతుకమ్మ డ్యాన్స్ కో ఆర్డినేషన్‌ను నిత్యశ్రీ కెఎస్, మొత్తం ఏర్పాట్లను నందాదేవి శ్రీరామ చూశారు.
శ్రీనివాస్ మానాప్రగడ మాట్లాడుతూ, ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన బే ఏరియా టాటా టీమ్‌ను అభినందించారు. వేడుకలకు అవసరమైన స్థలాన్ని, అలంకరణలకు సహాయం చేసిన శ్రీమతి శాలిని, రాజేష్‌కు, రిత్విక్‌లకు ధన్యవాదాలు చెప్పారు. ల్యాబ్ క్యూబ్ ఇంక్ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది. ఈ సందర్భంగా ల్యాబ్ క్యూబ్ ఇంక్ తయారు చేసిన కోవిడ్ సేఫ్టి కీని అందరికీ పంపిణీ చేశారు. వైరస్ ఉన్న ప్రాంతాలను, పరికరాలను డైరెక్ట్ గా తాకకుండా ఈ కీ ద్వారా మీరు తాకవచ్చు. కోవిడ్ వైరస్ నుంచి రక్షణను ఈ కీ మీకు అందజేస్తుంది. నిత్యశ్రీ కెఎస్, ప్రసాద్ వుప్పలపు, రవి నేతి అందరికీ ధన్యవాదాలు చెప్పారు.













