కోవిడ్ 19 పేషంట్లకు సేవలందిస్తున్న వైద్యులను ప్రశంసించిన టాటా
కోవిడ్ 19 వైరస్‌తో ఇబ్బందిపడుతున్న పేషంట్లను కాపాడటానికి అహర్నిశలు కష్టపడుతున్న భారతీయ వైద్యుల సేవలను ప్రశంసిస్తూ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో కార్ల ర్యాలీ నిర్వహించి వారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు. క్లిష్ట సమయంలో వారు అందిస్తున్న సేవలు మరువలేనివని ఈ సందర్భంగా టాటా నాయకులు వారికి చెప్పారు. మదర్స్ డేను పురస్కరించుకుని మహిళా డాక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు.
న్యూయార్క్ కోర్ గ్రూపు మెంబర్లయిన మల్లిక్ రెడ్డి, పవన్ రవ్వ, సహోదర్ పెద్దిరెడ్డి, ఉషా మన్నెం, మాధవి సోలేటి, అశోక్ చింతకుంట, రామ వనమ, యోగి వనమా, సత్య గగ్గెనపల్లి, మౌనిక బర్మ, వాణి సింగిరికొండ, ప్రహ్లాద కులకర్ణి, ప్రవీణ్ గోవిందు, చంద్రశేఖర్ కొత్త, రాగిణి రవ్వ, వర్థన్ రవ్వ, ఆనిక తీపిరెడ్డి, శ్రీవత్స్ రవ్వ, భవిన్ కొత్త తదితరులు కమ్యూనిటీ డాక్టర్లను అభినందించినవారిలో ఉన్నారు. డాక్టర్ శ్రీదేవి భూమి, డా. జానకి అల్లూరి, డా. భారతి రెడ్డి, డా. శిల్పారెడ్డి పైళ్ళ, డా. మీరా బొప్పన, డా. రాధా వోలేటి, డా. పావని తిపిర్నేని, డా. వసుంధర కలశపూడి తదితర డాక్టర్లను టాటా నాయకులు ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అభినందించారు.






