వలస కార్మికులకు బస్సులను ఏర్పాటు చేసిన టాటా, ఎఇసిఎస్
కోవిడ్ 19 సంక్షోభంలో తీవ్రంగా కష్టాలు ఎదుర్కొంటున్న వలస కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ముందుకు వచ్చింది. వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేసింది. ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ అలూమ్ని, స్టూడెంట్స్లతో కలిసి టాటా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్ నుంచి కలకత్తా, రాంచి, ఝార్ఖండ్, పాట్నా, ఒరిస్సాకు బస్సులను ఏర్పాటు చేశారు. అమెరికాలోని, తెలంగాణలోని వివిధ ఎన్జివో సంస్థల సహకారంతో వివిధ చోట్లకు బస్సులను టాటా ఏర్పాటు చేసింది. ఎఇసిఎస్ అలూమ్నికి చెందిన రాజేశ్ సింగ్ మాట్లాడుతూ, గత 60 రోజులుగా తామంతా, ఎన్నారైల సహకారంతో వలస కార్మికులకు అవసరమైన నిత్యావసర సామాగ్రి, భోజనాన్ని అందజేశామని చెప్పారు. ఈ సేవను నిర్వహించడంలో సహకరించిన స్పాన్సర్లకు, వలంటీర్లకు రాంప్రసాద్, నవీన్ బాలి, జయకాంత్ బార్ల, రాంగోపాల్ ధన్యవాదాలు చెప్పారు.
శ్రీనివాస్ మానాప్రగడ (టాటా, యుఎస్ఎ), అబ్బాల వెంకట కృష్ణ (ఎటి) చికాగో, యుఎస్ఎ, రమేశ్ దాడి (అస్టిన్, టెక్సాస్, యుఎస్ఎ), గణేశ్ కుమార స్వామి (న్యూజెర్సి, యుఎస్ఎ), ప్రదీప్ మన్నెమేలా (చికాగో, యుఎస్ఎ), జిఎన్వర్ వర్మ (న్యూజెర్సి, యుఎస్ఎ), ఎఇసిఎస్, హైదరాబాద్కు చెందిన ఎస్. రాంప్రసాద్, అనూప్రాయ్, రాజేశ్ సింగ్, నవీన్బాలి, జయకాంత్ బార్ల, మోర శ్రీనివాస్ రెడ్డి, రామగోపాల్ కూరపాటి, ఆరోగ్యరాజు, దిలీప్ కుమార్ తదితరులు ఈ సేవను స్పాన్సర్ చేశారు.













