ఘనంగా ముగిసిన టాంటెక్స్ 151 వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
తెలుగు సంఘం సాహిత్య వేదిక సమర్పించిన నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు ఈ ఆదివారం ఫిబ్రవరి 23 న శుభం ఫంక్షన్ హాల్లో సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ విజయ సారధి జీడిగుంట గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటకంగా 151 నెలలుగా సాహితీ వేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ ఈ సంస్థ యొక్క విశేషం. సాహిత్య వేదిక సమన్వయకర్త మల్లిక్ రెడ్డి కొండా గారు మరియు కృష్ణారెడ్డి కోడూరు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్యా అతిధి గా “శ్రీ విజయా సారధి జీడిగుంట” గారు ముఖ్య అతిధి గా విచ్చేసారు. వీరు ముందుగా ప్రార్ధన గీతం తో సభను ప్రారంభించారు. ఈ సదస్సుకు సాహితీ వేత్తలు భాషాభిమానులు విచ్చేసారు.
అనంతరం నరసింహారెడ్డి ఉరిమిడి గారు సభికులను సామెతలు తో ఆనందపరిచారు. తర్వాత లెనిన్ వేముల గారు వాల్మీకి రామాయణం లోని పధ్యాలను గానo చేసి విశ్లేషణతో వివరించారు. శ్రీమతి విష్ణుప్రియ అన్నమాచార్య కీర్తనతో అలరించారు. అనంతరం ఉపద్రష్ట గారు సాహిత్వ పిచ్చాపాటి గురించి ప్రసంగించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిధి గా వచ్చిన శ్రీ విజయ సారధి జీడిగుంట గారు “నన్నయ కవితా రీతులు పామరుని విశ్లేషణ” అనె అంశo పై ప్రసంగించారు. నన్నయ యొక్క కవితా లక్షణాలను ఆయన కవిత పదజాలను మహాభారతాన్ని ఎలా మలిచారో ఆయన ఉదాహరణతో వివరించారు. అనంతరం పాలకమండలి సభ్యులు అతిధిని సత్కరించారు. జొన్నలగడ్డ సుబ్బు గారు, శ్రీ తోటకూర ప్రసాద్ గారిని వేదికమీదకు ఆహ్వానించారు. ప్రసాద్ గారు మాట్లాడుతూ తన కుమార్తె ప్రశాంతి గారు చేసిన అవయవ దానం (Bone Marrow) గురించి ఉద్వేగ భరితంగా మాట్లాడారు.
ఈ సదస్సుకు మల్లిక్ రెడ్డి కొండా గారు, కృష్ణారెడ్డి గారు, శ్రీ విజయ్ సారధి గారు, NRU గారు, లెనిన్ గారు, సుబ్బు గారు, చిన సత్యం గారు, ప్రసాద్ తోటకూర గారు, సుధా కల్వకుంట గారు, రాజారెడ్డి గారు, ఉమాదేవి గారు, శరత్ గారు, వెంకట్ గారు, అశ్వని వెలివేటి గారు, రవి పట్టిసం గారు, శశి పట్టిసం గారు, వేణు భీమవరపు, విష్ణుప్రియ తదితరులు సభను జయప్రదం చేసారు.













