ఘనంగా టాంటెక్స్ 149 నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించు ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు ఆదివారం, డిసెంబరు 15న వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 149 నెలలు పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ యొక్క విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేసారు.
కార్యక్రమంలో ముందుగా ప్రముఖ సాహితీ వేత్త, రచయిత, విలక్షణ నటుడు, స్నేహశీలి, బహుముఖ ప్రజ్ఘ్నాశాలి డా. గొల్లపూడి మారుతీరావు గారు, ప్రముఖ రంగస్థల నటుడు శ్రీ రామచంద్ర నాయుడు గారు డాలస్ సాహితీ మిత్రులకి చాలా ఆత్మీయులు అని వారి ఆకస్మిక మృతి ఇక్కడ సాహితీ మిత్రులు అందరిని విషాదానికి గురిచేసిందని, డా. గొల్లపూడి మారుతీ రావు గారు టాంటెక్స్ మొట్టమొదటి సాహిత్య వేదికను ప్రారంభోత్సవం చేశారని గుర్తు చేసుకున్నారు. అలాగే శ్రీ రామచంద్ర నాయుడు గారు టాంటెక్స్ 12వ వార్షికోత్సవం లో సత్య హరిచంద్ర నాటకం లో కాటి సీను ప్రదర్శించారని గుర్తుచెసుకున్నారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. తరువాత చిన్నారులు వేముల సాహితి, వేముల సింధూర ”శ్రీ రామదాసు” కీర్తనలతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. డా. ఊరిమిండి నరసింహరెడ్డి – మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి, జాతీయాలు, పొడువు కథలు గురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు.
వేముల లెనిన్ మరియు కిరణ్మయి వేముల శ్రీ రామచంద్ర నాయుడు గారు తో వున్న అనుబంధాన్ని అలాగే వారి పరిచయానుభవాలను అందరితో పంచుకున్నారు. ఎంతో చలాకీగా మన అందరిమధ్యలో కలసి మెలసి నవంబరు మాసం వరకు డాలస్ లో మన మధ్యలో వున్న వారు హఠాత్తుగా మరణించడం ఎంతో బాధకు గురి చేసిందని తెలియజేశారు. తరువాత టాంటెక్స్ అధ్యక్షులు శ్రీ వీర్నపు చినసత్యం సిం హావలోకనం శీర్షికన గత 11 నెలలు నిర్వహించిన సాహిత్య సదస్సులకు విచ్చేసిన ముఖ్య అతిథులు మరియు వారు మాట్లాడీన అంశాలను టూకిగా వివరించి, ఈ సంవత్సరం మీ అందరి సహకారంతో అతిరథ మహరథులైనతువంటి అతిథులను మన వేదికకు తీసుకురాగలిగాం అని, అలాగే జాతీయ సంస్థలు తానా, నాట్స్ తో కలసి సాహిత్య సదస్సులు నిర్వహించడం మన టాంటెక్స్ అందరితో కలసి పనిచేసిందనడానికి నిదర్శన అని, అలా కలసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు తరువాత టాంటెక్స్ వారు నిర్వహించిన సాహిత్య సదస్సులపై సభాసదుల సూచనలను, సలహాలను తెలియచెయవలసిందిగా కోరారు.
టాంటెక్స్ అధ్యక్షులు శ్రీ వీర్నపు చినసత్యం ముఖ్య అతిథి శ్రీ నందివాడ భీమారావు గారిని సభకు పరిచయం చేశారు. తరువాత శ్రీ కన్నెగంటి చంద్ర శెఖర్ గారు నందివాడ భీమారావు గారు రచించిన ‘ుష్ట్రవ ూత్ీ శీట ్‌ష్ట్రవ Iఎజూశీరరఱపశ్రీవ” పుస్తకాన్ని పరిచయం చేసి, టాంటెక్స్ అధ్యక్షులు శ్రీ వీర్నపు చినసత్యం, పూర్వాధ్యక్షులు కన్నెగంటి చంద్రశెఖర్, డా. తోటకూర ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, డా. ఉరిమిండి నరసింహారెడ్డి, ఆనందమూర్తి, లలితా మూర్తి కూచిబొట్ల, సతిష్ బండారు, టాంటెక్స్ కమిటీ సభ్యులు సమక్షంలో పుస్తకావిష్కరణ చేశారు. నెలనెలా తెలుగు వెన్నెల సాహితీ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖక కవి శ్రీ వి.ఆర్.విధ్యార్ధి తమ ఉపన్యాసంలో 1947 లో మొదలు పెట్టిన స్వతంత్ర భారత చరిత్రకి ఇప్పుడు డెబ్భయి సంవత్సరాలు నిండాయి. ఈ 70 సంవత్సరాలలో మన దేశం సాధించిన ప్రగతి అంకెల్లో కొలిస్తే ఎంతో గణనీయంగా కనిపిస్తుంది. ఇవాళ వి2.2 ్తీఱశ్రీశ్రీఱశీఅ +ణూతో మన దేశం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది. అయితే, ఈ ప్రగతి ”ూషషబజూవ ఔaశ్రీశ్రీ ూ్తీవవ్” పరిభాషలో చెప్పాలంటే కేవలం 1% ప్రపంచానికి మాత్రమే పరిమతమయ్యింది. 99% జనాభాకి ఆర్థిక ప్రగతి ”వినువీధులలో విహరించే అందని అందం” గానే ఇంకా కనిపిస్తోంది. మన దేశం జనాభాలో 1 శాతం చేతుల్లో 70 శాతం ఆర్థిక వనరులు కేంద్రీకతమయ్యి ఉన్నాయి. మిగిలిన జనానికి మాత్రం ఇప్పటికీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అలాగే ఉంది. ఈ ఆర్ధిక అసమానతలని తొలగించడం సాధ్యం కాని పని అన్న వాదన ఇటీవల తరుచు వినవస్తోంది. కానీ అసాధ్యాలని సాధించడం మనకి అలవాటు. చరిత్రలో ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనపడతాయి. నందివాడ భీమారావు గారిని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షులు వీర్నపు చినసత్యం, పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. శ్రీ నందివాడ భీమారావు గారు తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిధ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి కతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ శ్రీ నందివాడ భీమారావు గారి సేవలను ఎంతో కొనియాడారు. సాహిత్యం మీద ప్రేమ, మాత భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.













