తానా వాలీబాల్, త్రోబాల్ విజేతలు
తానా 22వ మహాసభలను పురస్కరించుకుని నిర్వహించిన తానా వాలీబాల్, త్రోబాల్ పోటీలు విజయవంతమయ్యాయి. వర్జీనియాలోని ఛాంటిటీలో జూన్ 15వ తేదీన ఈ పోటీల్లో ఎంతోమంది క్రీడాకారులు పాల్గొన్నారు. రాజేష్ కాసరనేని ఆధ్వర్యంలో సాగిన ఈ పోటీలకు సురేంద్ర, సువీర్, అమర్, సతీష్, మూర్తి, దినకర్, సుధీర్, సుశాంత్, కౌశిక్, రవి, అభిలాష్, పవన్, రాజేష్ వలంటీర్లుగా వ్యవహరించారు.
వాలీబాల్ పోటీల్లో మొదటి బహుమతిని షో స్టాపర్స్ టీమ్ గెలుచుకుంది. ఈ టీమ్‌కు కెప్టెన్‌గా సనత్ వ్యవహరించారు. 2వ బహుమతిని వెంకీ సారధ్యంలోని కంట్రీ ఓవెన్ కింగ్స్ గెలుచుకుంది.
త్రోబాల్ పోటీల్లో మొదటి బహుమతిని రాయల్ థండర్స్ టీమ్ గెలుచుకుంది. ప్రీతి దీనికి కెప్టెన్‌గా వ్యవహరించారు. 2వ బహుమతిని లక్ష్మీ సారధ్యంలోని సన్‌రైజర్స్ టీమ్ గెలుచుకుంది. మూడవ బహుమతిని సూపర్ 7 టీమ్ గెలుచుకుంది. దీనికి భవ్య కెప్టెన్‌గా వ్యవహరించారు.
ఈ ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచినవారిని అధ్యక్షుడు సతీష్ వేమన, కాన్ఫరెన్స్ నాయకులు మూల్పూరి వెంకటరావు, కొడాలి నాని అభినందించారు.













