తానా టేబుల్ టెన్నిస్ పోటీలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో లాస్ ఏంజెలిస్‌లో మొదటిసారిగా టేబుల్ టెన్నిస్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లొ 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు సతీష్ వేమన ముఖ్య అతిధిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. చిన్నారుల విభాగంలో ఆశ్రయ్ ఆత్మకూరు విజేతగా విశ్రుత్ సాతులూరి రన్నరప్‌గా నిలిచారు. పురుషుల సింగిల్స్‌లో సుధాం, హర్ష ఆత్మకూరుపై ఫైనల్స్‌లో విజయం సాధించారు. హోరా హోరీగా జరిగిన మహిళా సింగిల్స్ విభాగంలో పుష్ప పగిడ్యాల ప్రథమ స్థానంలో రేఖ ద్వితీయస్థానంలో నిలిచారు. పురుషుల టీం విభాగంలో రాజారెడ్డి-హితేన్ ప్రధమస్థానంలో కష్ణ సామంతుల-ప్రవీణ్ కీర్తి ద్వితీయస్థానంలో నిలిచారు. తానా లాస్ ఏంజెలెస్ సిటీ కో-ఆర్డినేటర్ సురేష్ కందేపు, కార్యకర్తలు చంద్రశేఖర్ పల్లెబోయిన, శ్రీకాంత్ మోపర్తి, వినోద్ బూరుగుపల్లి, శ్రీనివాస్ పోపూరి, రవీంద్ర జంగాల, హర్ష ఆత్మకూరు, శ్రీహరి కొమ్మలపాటి, అమర్ కేతిరెడ్డి, సతీష్ నండూరి, సెంథిల్ కుమార్, మురళి పోట్ల, రామ్ యార్లగడ్డ, శశాంక్ రెడ్డి, మీర్, సజన్ యాపర్తిలు ఈ పోటీల నిర్వహణలో పాల్గొన్నారు.













