రెడ్జోన్లో ఇబ్బందిపడుతున్న పేదలను ఆదుకున్న రవి పొట్లూరి
తెలంగాణ రాష్ట్రంలో రెడ్జోన్లో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ మున్సిపాలిటీలో ఇటీవల ఇరవై మందికి కరోనా పాజిటివ్ వచ్చి క్వారంటైన్ కు తరలించడం జరిగింది. రెండు వారాల తర్వాత పరీక్షల్లో నెగటివ్ రావటంతో వారు తిరిగి శాంతినగర్ చేరుకున్నారు. నిత్యావసరాలు లేక ఇబ్బంది పడుతుండటంతో వారికి సహాయం చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ పార్థసారధి ఫిలడెల్ఫియాలో ఉంటున్న తానా కార్యదర్శి రవి పొట్లూరిని కోరటంతో తక్షణం స్పందించి వారి ఇండ్ల దగ్గరికే నిత్యావసరాలను పంపిణీ చేయించారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకునేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని రవి పొట్లూరి తెలిపారు.













