విద్యార్థినికి కంప్యూటర్ బహుకరించిన తానా కార్యదర్శి పొట్లూరి రవి
కాన్సర్ వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ సహాయంతో కోలుకుని ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని డిగ్రీలో చేరిన అనంతపురం కి చెందిన స్వప్న అనే విద్యార్థినికి అమెరికాలోని ఫిలడెల్ఫియా లో ఉంటున్న తానా కార్యదర్శి పొట్లూరి రవి లాప్ టాప్ కంప్యూటర్ ను ఈరోజు మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గౌస్ మొహియుద్దీన్ ద్వారా అందించారు.
స్వప్న పూర్తిగా కోలుకోవటంలో బాలకృష్ణ గారు తీసుకున్న జాగ్రత్తలు, చేసిన సహాయం వెలకట్టలేనిదని మిత్రుడు, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గౌస్ మొహియుద్దీన్ ద్వారా ఎప్పటికప్పుడు స్వప్నకు సంబందించిన విషయాలు తెలుసుకుంటున్నామని గత డిసెంబర్లో స్వప్న ను బసవతారకం కాన్సర్ హాస్పిటల్ లో పరామర్శించడం జరిగిందని తన వంతు సహాయంగా కంప్యూటర్ అందిస్తున్నానని భవిష్యత్తులో కూడా స్వప్నకు అండగా ఉంటానని పొట్లూరి రవి తెలిపారు.













