తానా శాట్ శిక్షణ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో కెరీర్‌కు ఉపయోగపడే విధంగా శాట్ శిక్షణను వర్చువల్ ఇచ్చే కార్యక్రమాన్ని జూలై 31 నుంచి ప్రారంభిస్తోంది. దాదాపు 10 సెషన్‌లపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. హాసిత్ గారపాటి ఈ శిక్షణను ఇవ్వనున్నారు. జూలై 31, ఆగస్టు 3,7,10,14,17,21,24,28,31 తేదీల్లో ఈ కార్యక్రమంను ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ ఫీజు 75 డాలర్లుగా నిర్ణయించారు. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు ఆధ్వర్యంలో తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేక, కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ లోకేష్ నాయుడు కొణిదెల, న్యూజెర్సి రీజినల్ రిప్రజెంటేటివ్ రామకృష్ణ వాసిరెడ్డి, క్యాన్సర్ క్యాంప్స్ కో ఆర్డినేటర్ సుధీర్ నారెపాలెపు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.