TANA: కొప్పాకలో ‘రైతు కోసం తానా’
 
                                    రైతులకు వ్యవసాయ రంగంలో చేయూతనివ్వాలనే సదుద్దేశంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ‘రైతు కోసం తానా’ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. డీవీ చలపతి రావు స్మారకార్థం ఆయన సతీమణి నారేసాలెపు సునీత సహకారంతో కొప్పాకలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. పంట దిగుబడిని పెంచడానికి పది పవర్ స్ప్రేయర్లు, పది టార్పలిన్లను కొప్పాక పెదకడిమి, రామచంద్రపురం గ్రామాలకు చెందిన పేద రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో కొప్పాక గ్రామ సర్పంచి దీక్షితులు, పెదకడిమి సర్పంచి బలరామకృష్ణ చౌదరి, తానా సభ్యులు మేకా సతీష్, ఎంఈవో అరుణ్, కొప్పాక జడ్పీ పాఠశాల హెడ్మాస్టర్ శైలజ, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
గ్రామాల్లో రైతులకు చేస్తున్న సేవలకు గాను తానా కార్యవర్గాన్ని చింతమనేని ప్రభాకర్ ప్రశంసించారు.సుధీర్ నారెపలుపు, సతీష్ మేకా అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సహకరించిన తానా కార్యదర్శి రాజా కసుకుర్తి, రైతు కమిటీ సభ్యులు రమణ అన్నె, జానయ్య కొట, అనిల్ యలమంచిలి, వెంకట్ కొసరాజు, ప్రసాద్ కొల్లి, వీరలెనిన్ తాల్లురి, ప్రేమ కొమ్మారెడ్డి, శ్రీనివాస్ యలమంచిలి, బొడ్డు సుధాకర్‌కు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.











