ఫార్మింగ్టన్ విద్యాలయం విద్యార్థులను ఆదుకోవాలి – తానా
డిట్రాయిట్ లో ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసులో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలుగు విద్యార్థులను అన్యాయంగా అరెస్టు చేశారని వారిని ఆదుకోవాలని తానా అధ్యక్షుడు సతీష్ వేమన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కోరారు. అమెరికా అధికారుల అదుపులో ఉన్న విద్యార్థులని మానవీయకోణంలో అలోచించి వెంటనే విడుదల చేయుంచి ఇతర యూనివర్సిటీలలో జాయిన్ చేసుకునేవిధంగా అమెరికా అధికారులతో చర్చించి భారతప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా సతీష్ వేమన ఉపరాష్ట్రపతిని కోరారు. అరెస్టయిన విద్యార్థులకు భారత ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని తానా బందానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. అరెస్టయిన విద్యార్థులకు సాయం చేసేందుకు భారత ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యల గురించి తానా అధ్యక్షుడు సతీష్ వేమన ఆధ్వర్యంలో తానా బృందం ఉపరాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ బృందంలో తానా కోశాధికారి రవి పొట్లూరి తదితరులు ఉన్నారు.













