తానా లైవ్ సంగీత కార్యక్రమం మే 7న
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) లైవ్ మ్యూజికల్ ఎంటర్టైన్ మెంట్ కార్యక్రమాలను ఎన్నారైల కోసం ఏర్పాటు చేసింది. కోవిడ్ 19 కారణంగా అమెరికాలో ప్రశాంతత కరువైన నేపథ్యంలో మనస్సుకు రిలాక్స్ ను కల్పించేందుకు వీలుగా ఇలాంటి లైన్ సంగీత కార్యక్రమాలను తానా ఏర్పాటు చేసింది. మే 7వ తేదీ రాత్రి 9 గంటలకు గానం సంగీతం పేరుతో ఏర్పాటు చేసిన పాటల లైవ్ కార్యక్రమంలో గాయనీ గాయకులు గీతా మాధురి, శ్రీకృష్ణ, పృథ్వీచంద్ర పాల్గొని పాటలను పాడనున్నారు. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వర్షిణి వ్యవహరిస్తున్నారు. టీవీఏసియా ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చని తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి తెలిపారు.













