TANA: బోస్టన్‌లో తానా పికిల్ బాల్ టోర్నమెంట్ విజయవంతం
బోస్టన్: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) ఆధ్వర్యంలో బోస్టన్ లో నిర్వహించిన పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు మంచి స్పందన వచ్చింది. క్రీడలు దైనందిన జీవితంలో ముఖ్య భాగమని అందుకే ఈ మధ్యకాలంలో, ప్రాచుర్యం పొందుతున్న పికిల్ బాల్ టోర్నమెంట్ ని నిర్వహించినట్లు తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానికొండ తెలిపారు. ఓడిన ప్రతి సారి, ఓటమి నుంచి నేర్చుకొంటూ, సరిద్దిదుకుంటూ జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి ఈ సందర్భంగా క్రీడాకారులకు సూచించారు. మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ మరియు మహిళల డబుల్స్ విభాగాలలో 28 జట్లు పాల్గొన్నాయి.
ఈ ఈవెంట్ ఐదు గంటలకు పైగా కొనసాగింది, అసాధారణ నైపుణ్యం, జట్టుకృషి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన 120 మందికి పైగా ఆటగాళ్లను ఒకచోట చేర్చింది. విజేతలు, రన్నర్లకు ట్రోఫీస్, షీల్డ్స్‌ను సోర్స్ గ్రూప్ అఫ్ కంపెనీస్ అధినేత శ్రీ బోళ్ల బహుకరించారు. రవి ఉప్పలపాటి, అనిల్ గోవాడ, గోపి నెక్కలపూడి, తిర్బు పారుపల్లి, వేణు కూనంనేని, సురేష్ దోనేపూడి ఈ టోర్నమెంట్ ను సజావుగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. వారి ప్రయత్నాలను గుర్తించి, ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ యెండూరి ప్రశంసించారు. స్థానిక క్రీడాకారులు, యువతతో ప్రాంగణమంతా నిండిపోయింది. అందరకి అల్పాహారం, టీ ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ లింగ ప్రసాద్ చావా ఈ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
-Govindarajan






