TANA Paatasala: మినియాపొలిస్ లో ఇండియా ఫెస్ట్… తానా పాఠశాల సభ్యత్వ నమోదు

భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మినియాపోలిస్ (Minneapolis) లో ఇండియా ఫెస్ట్ వేడుకలు జరిగింది. ఈ సంబరాల్లో తానా నార్త్ సెంట్రల్ టీమ్ పాల్గొంది. ఈ సందర్భంగా తానా ‘పాఠశాల’ (TANA Paatasala) సభ్యత్వ నమోదు విశిష్టతను తెలుపుతూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
తానా పాఠశాల నార్త్ సెంట్రల్ కోఆర్డినేటర్ నాగరాజు మల్లంపాటి మాట్లాడుతూ.. అమెరికాలోని తెలుగు పిల్లలకు సరళమైన తెలుగు నేర్పించి.. మన మాతృభాషను భావితరాలకు అందించడమే ‘పాఠశాల’ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అమెరికాలో నివాసముంటున్న తెలుగువారి పిల్లలను సెప్టెంబర్లో ప్రారంభం కానున్న తరగతుల్లో చేర్పించాలని కోరినట్లు తెలిపారు. తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, తానా పాఠశాల ఛైర్ భాను మంగుళూరి ప్రోత్సాహంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తానా నార్త్ సెంట్రల్ రిప్రజెంటేటివ్ రామ్ వంకిన, తానా సెంట్రల్ టీమ్ అజయ్ తాళ్లూరి, వేదవ్యాస్ ఆర్వపల్లి, వెంకట్ జువ్వా, తానా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు. రిజిస్ట్రేషన్ల కోసం వెబ్సైట్ www.paatasala.tana.org/registration ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.