తానా నవలల పోటీ 2019 – ఉత్తమ నవలకు 2 లక్షల రూపాయల బహుమతి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలు 2019 జులై 4, 5, 6 తేదీలలో వాషింగ్టన్ నగరంలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు నవలల పోటీ నిర్వహించి, ఉత్తమ నవలకు రెండు లక్షల రూపాయల బహుమతిని ఇవ్వాలని తానా కార్యవర్గం నిశ్చయించింది. 2017లో తానా నిర్వహించిన నవలల పోటీలో బహుమతికి ఎంపికైన శప్తభూమి, నీల, ఒంటరి నవలలు సాహితీలోకంలో ఒక కదలికను తీసుకొచ్చాయి. తెలుగు నవలారంగంలో కొంతకాలంగా కనబడుతున్న స్తబ్ధతకు ఈ పోటీవల వల్ల కొంత సడలింపు వచ్చింది. ఈ వాతావరణానికి కొనసాగింపుగా తెలుగు సాహిత్యంలోనూ, ప్రపంచ సాహిత్యంలోనూ కలకాలం నిలబడే నవలలను వెలికి తీసుకురావాలనే తానా ప్రయత్నానికి స్పందించి ఈ పోటీలో పాల్గొనవలసిందిగా తెలుగు రచయితలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.
నిబంధనలు :
* నవలలు తెలుగు జీవితాన్ని ప్రతిబింబించాలి.
* ప్రపంచంలోని ఎక్కడివారయినా ఈ పోటీకి నవలలు పంపించవచ్చు.
* నవలకు పేజీల పరిమితి లేదు.
* బహుమతికి ఎంపిక కాని నవలలను తిప్పిపంపడం సాధ్యంకాదు. కాబట్టి జిరాక్స్ కాపీలు కూడా పంపవచ్చు.
* నవలలు తమ స్వంతమని, అనువాదాలు, అనుసరణలు కావని, ఇంతకుముందు ఎక్కడా ప్రచురితం కాలేదని, ఎక్కడికీ ప్రచురణకు పంపలేదని, తానా పోటీ ఫలితాలు వచ్చేవరకూ ఏ ప్రచురణకు, పోటీకి పంపబోమని పేర్కొంటూ హామీపత్రాన్ని జతచేయాలి.
* నవలలు తప్పనిసరిగా సృష్టమైన చేతివ్రాతతో కాని, డిటిపి చేసికాని పంపాలి.
* డిటిపి చేసిన నవలలను tana.novel.2019@gmail.com కు పంపవచ్చు.
* నవలల పై రచయిత పేరు, చిరునామా ఉండకూడదు. అవన్నీ కవరింగ్ లెటర్ పై ఉండాలి.
* నిర్వాహకుల నిర్ణయాలపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు. వివాదాలన్నింటినీ అమెరికాలోని వాషింగ్టన్ డి.సి. న్యాయపరధిలో పరిష్కరించుకోవాలి.
* బహుమతి పొందిన నవల ఉన్నత ప్రమాణాలను అందుకునేటట్లుగా ఉండాలన్నది తానా ఆకాంక్ష. ఆ ప్రమాణాలను అందుకునే నవలలు పోటీకి రాని పక్షంలో
బహుమతి ఇవ్వకపోవడం కానీ లేదా పూర్తి బహుమతి తగ్గించడం కానీ, ఒకటి కంటే ఎక్కువ నవలల మధ్య పంచడం కానీ తానా నిర్ణయం ప్రకారం జరుగుతుంది.
* బహుమతికి ఎంపికైన నవల మొదటి రెండు ముద్రణలను, ఇతర పారితోషికం ఏమీ లేకుండా ప్రచురించే హక్కు తానాకు ఉంటుంది.
రచనలు అందవలసిన ఆఖరు తేది: 30 మార్చి 2019
రచనలు పంపవలసిన చిరునామా :
అక్షర క్రియేటర్స్, ఎజి-2, ఎ బ్లాక్, మాతృశ్రీ అపార్ట్మెంట్స్,
హైదర్గూడ, హైదరాబాద్ -500029
ఇతర వివరాలకు సంప్రదించండి
ఫోన్స్ : 98493 10560
040 -23244088
Email : tana.novel.2019@gmail.com
సతీష్ వేమన (తానా అధ్యక్షులు)
జంపాల చౌదరి (కార్యక్రమ నిర్వాహకులు)
చంద్ర కన్నెగంటి (తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు)













