TANA: పోయిన డబ్బును తిరిగి రాబట్టడం నా ప్రథమ కర్తవ్యం.. తెలుగుటైమ్స్‌తో నూతన అధ్యక్షులు డా. నరేన్ కొడాలి
తానా (TANA) సంస్థకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తున్నా, తానా మహాసభలు విజయవంతం జరుపుకోవడం, వేలాదిమంది తరలిరావడం, సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం, ప్రముఖులను సత్కరించుకోవడం జరిగింది. తానా అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డా. నరేన్ కోడాలి తానాలోనే కాకుండా తెలుగు కమ్యూనిటీలో కూడా అందరికి తెలిసిన నాయకుడు. దాదాపు 20 ఏళ్లకు పైగా అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొని తానా అధ్యక్షుడి పదవి వరకు ఎదిగిన విద్యావేత్త. డా. నరేన్ కొడాలి తెలుగుటైమ్స్‌తో మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పారు. సున్నితమైన అంశాలు మీద కూడా మాట్లాడారు.
అతి పెద్ద ఆర్ధిక నేరం జరిగి తానా సంస్థకె పెద్ద మచ్చ పడిన తానా ఫౌండేషన్‌లో ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ), డల్లాస్‌తో సంప్రదింపులు నిధులు తరలించిన రెండో రోజునే మొదలు పెట్టాము. దర్యాప్తులో భాగంగా బ్యాంక్ అకౌంట్ వివరాలు, తరలించిన డబ్బు వివరాలతో 100 పేజీల నివేదిక ఇవ్వడం జరిగింది. అదే సమయంలో మ్యాచింగ్ గ్రాంట్స్ మీద కూడా ఎఫ్‌బిఐకి ఫిర్యాదు లు వెళ్లడం తో ఎఫ్‌బిఐ కేంద్ర సంస్థ కూడా దర్యాప్తు మొదలు పెట్టి అన్ని వివరాలు అడగడం, మేము వాటికి కూడా పూర్తి వివాదాలల్తో దాదాపు 1000 పేజీల నివేదిక ఇవ్వడం జరిగింది. అందు వలన ఎఫ్‌బిఐ కేంద్ర సంస్థ (ఖీదీI, జవఅ్‌తీaశ్రీ శీటటఱషవ) మొత్తం కేసును పరిశీలిస్తోంది.
ఆర్ధిక నేరం చేసిన వ్యక్తి ఈ దేశంలో ఉన్నారు. స్వతంత్రంగా తిరుగుతున్నారు. ఏమీ చేయాలేదు అని అందరూ అనుకొంటున్నారు. మనకు ఎంత ఇబ్బంది ఉన్నా చట్టం తన పని తాను చేసుకుం టోంది. దాదాపుగా 3.6 మిలియన్ డాలర్లు తరలించడం జరిగింది. ఇది అందరి సమస్య. డబ్బు కూడా ప్రజలది. ప్రతివాది అయిన శ్రీకాంత్ పోలవరపు, ఆయన తరుపున న్యాయవాది ‘ఈ నిధులు మీమే తరలించాము. మా ఆస్తులు జప్తి చేసి అయినా తిరిగి కడుతున్నాము’ అని చెప్పడం జరిగింది. ఇందులో 6,50,000 డాలర్లు మధ్యవర్తులు, శశికాంత్ వల్లేపల్లి, ఫౌండేషన్ లో ఉన్న వారు తిరిగి రాబట్టడం జరిగింది.
తానాలో ఏం జరగబోతోంది?
నేను అధ్యక్షుడు అయిన తర్వాత చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న ఇదే. ‘తానాలో ఏం జరగబోతుంది? మళ్లీ డబ్బులు తిరిగి తీసుకరండి అనేది మీ ప్రధాన అజెండా అని అన్నారు. తానా ఎన్నికలు జరిగాయి. నేను తానాలో ఉన్న సమయంలో అందరితో సత్ససంబంధాలు ఉన్నాయి. రాజకీయ సంబంధాలు లేవు. ఇప్పుడు ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లావు, కోశాధికారి రాజా కసుకుర్తి, కార్యవర్గంలో ఉన్న 53 మందితో సుదీర్ఘ కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో కొన్ని విభేదాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అందరితో కలిసి పోతాను. మేము అందరం కలిసికట్టుగా ఆలోచించి కార్యచరణలో రెండు, మూడు కార్యక్రమాలు అనుకోవాలి. అవి సంస్థకు పేరు ప్రఖ్యాతలు తేవాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేయవలసిన సేవ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఫౌండేషన్ చారిటీ కార్యక్రమాలు ఉన్నాయి. 85 వేల మంది సభ్యులు ఉన్నారు. వారి అవసరాలు గుర్తించాలి. పెరిగిన సభ్యులను దృష్టిలో కార్యవర్గం పెంచడం, ఫౌండేషన్ లో నలుగురు, బోర్డులో ఇద్దరు, మొత్తంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ)లో కొత్తగా 8 మందికి అవకాశం కల్పించాం. అలాగే హెల్త్ విభాగం, ఎన్‌ఆర్‌ఐ స్టూడెంట్, బెనిఫిట్స్ విభాగం, కమ్యూనిటీ సర్వీస్ విభాగం, మహిళా విభాగం కొత్తగా ఏర్పాటు చేసాం. అందరం కలిసి తానాకు పూర్వ వైభవం తీసుకుని రావడానికి పని చేస్తాం.
ఫెడరల్ గవర్నమెంట్ తానాకు మ్యాచింగ్ గ్రాంట్‌లు పూర్తిగా నిషేదించిందా?
మ్యాచింగ్ గ్రాంట్స్ ద్వారా నిధులు సమకూర్చుకొని కార్యక్రమం తానా ఫౌండేషన్‌లో ఏప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు కూడా తానా సంస్థ మాచింగ్ గ్రాంట్స్ మీద పూర్తి వివరాలతో నివేదిక కూడా ఇచ్చింది. అందుకని మనము ఇచ్చిన నివేదిక గవర్నమెంట్ పరిశీలనలో ఉంది కాబట్టి ఈ సమయంలో మాచింగ్ గ్రాంట్స్ కార్యక్రమానికి తాత్కాలికంగా నిలిపి వేద్దామనుకున్నాము. బోర్డులో అందరు కలిసి ఒక మేధోమథనం చేసి ఈ నిర్ణయం తీసుకున్నాము. జరుగుతున్న దర్యాప్తులో ప్రభుత్వానికి సహకరిస్తామని, సంపూర్ణ సహాయ సహకారాలు అందించి, వారికి కావాల్సిన డేటా ఇచ్చి. ఈ సమస్య నుంచి బయటపడిన తర్వాత దాని పునరాలోచన చేద్దామని నిర్ణయించు కొన్నాము.
అమెరికాలో తానా కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి?
ప్రస్తుతం తానా 70 శాతంలో మంది 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్నారు. 3 సంవత్సరా లలో భారతదేశం నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 5 లక్షల మంది స్టూడెంట్ లు ఆమేరికాకు వచ్చారు వారికీ ప్రత్యేక అవసరాలు ఉన్నాయి. వాళ్లకు చాలా సమస్యలు కూడా ఉన్నాయి. తెలియక చేసిన చిన్న తప్పులకు ఇక్కడ చదువు కొంటున్న విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ సమస్యలు వస్తున్నాయి. అలాగే హెచ్ 1బీ వీసాలో ఉండి ఉద్యోగం చేస్తున్న వారికి కూడా అనేక ఇమిగ్రేషన్ సమస్యలు ఉన్నాయి, తానా విద్యా పరమైన, సాంస్కృతి కపరమైన కార్యక్రమాలతో పాటు పూర్తిగా స్టూడెంట్స్‌కి ఎంప్లాయిస్ ఉన్న ఇమ్మిగ్రేషన్ సమస్యలపై సాధ్యమైనంత వరకు సహాయ సహాకారాలు ఇవ్వటమే తానా ప్రథమ అంశం. అధ్యక్షుడిగా నా ప్రధాన అంశం..
ఆంధ్రా, తెలంగాణలలో ఏం చేయబోతున్నారు?
తానా ఫౌండేషన్ నుంచి అనేక సేవా కార్యక్రమాలు ఎక్కువగా ఇండియాలో చేయడం అనేది మనకు అనాదిగా వస్తున్న ఆచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉపద్రవాలు వచ్చినప్పుడు తానా ముందుండి సాయం చేయడం జరుగుతుంది. ఇండియాలో వరదలు, ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. అదే విధంగా మా రెగ్యులర్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి తానా నిరంతరం పనిచేస్తుంది. అలాగే టీమ్ స్క్వేర్ (ువaఎ ూనబaతీవ) ద్వారా మేము నిరంతరం అనేక కుటుంబాలకు సహాయం అందిస్తున్నాం. అదే మా సంస్థకు ప్రాణవాయువు మా సంస్థ గౌరవం పెంచిన కార్యక్రమం. అన్ని సేవా కార్యక్రమాలు మరింత దిశ-దశ నిర్దేశంతో ముందుకు సాగుతున్నాము. తానాకు తోడుగా ఉంటున్న తెలుగు టైమ్స్‌కు ధన్యవాదాలు.
చెన్నూరి వేంకట సుబ్బారావు
ఎడిటర్ తెలుగు టైమ్స్







