తానా 5కె వాక్ విజయవంతం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూఇంగ్లాండ్ టీమ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29వ తేదీన కనెక్టికట్‌లో నిర్వహించిన తానా 5కె వాక్ విజయవంతమైంది. ఎన్నారైలను సొంత ఊరికి సేవ చేసేలా ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో తానా మన ఊరికోసం పేరుతో ఈ 5కే కార్యక్రమాన్ని అన్నీ చోట్ల నిర్వహిస్తోంది. కనెక్టికట్‌లో జరిగిన 5కె వాక్‌లో దాదాపు 200 మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. వంశీ వాసిరెడ్డి, విశ్వనాథ్ నాయునిపాటి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ జే తాళ్లూరి కూడా పాల్గొన్నారు.













