TANA: ఫిలడెల్ఫియాలో గంగాధర్ నాదెళ్ళకు ఘనసన్మానం
తానా (TANA) మిడ్-అట్లాంటిక్ బృందం, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి నాయకత్వంలో మరియు మిడ్-అట్లాంటిక్ ఆర్‌విపి వెంకట్ సింగు ఆధ్వర్యంలో 24వ తానా జాతీయ మహాసభల ఛైర్మన్ గంగాధర్ నాదెళ్ల (Gangadhar Nadella) గారిని, అలాగే కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంత్ర మరియు కాన్ఫరెన్స్ కార్యదర్శి కిరణ్ దుగ్గిరాలను మే 17వ తేదీ శనివారం ఫిలడెల్ఫియాలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించింది. డెట్రాయిట్ కాన్ఫరెన్స్ నాయకత్వానికి మిడ్-అట్లాంటిక్ బృందం యొక్క తిరుగులేని మద్దతును ఈ హృదయపూర్వక సన్మానం చాటిచెబుతోంది.
ఈ కార్యక్రమానికి తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ నరేన్ కోడాలి, కార్యదర్శి శ్రీ రాజా కసుకుర్తి, తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఒరుగంటి, తానా న్యూ ఇంగ్లాండ్ ఆర్‌విపి కృష్ణ ప్రసాద్ సోంపల్లి, 24వ కాన్ఫరెన్స్ యూత్ కమిటీ చైర్ విశాల్ బెజవాడతోపాటు ఇతర తానా కాన్ఫరెన్స్ కమిటీ సభ్యులు, తానా మద్దతుదారులు పాల్గొన్నారు.







