తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ ఫుడ్ డ్రైవ్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో హారిస్ బర్గ్ టీం సహకారంతో మెకానిక్స్ బర్గ్ లో ఉన్న న్యూ హోప్ మినిస్ట్రీస్ ఫుడ్పాంట్రీకి తానా నాయకులు ఫుడ్ ఐటెమ్స్ ను విరాళంగా ఇచ్చారు. దీపావళి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, తానా కార్యదర్శి రవి పొట్లూరి, తానా పాఠశాల చైర్ నాగరాజు నలజుల, బాలాజీ కరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హారిస్ బర్గ్ టీం కు ధన్యవాదాలు చెబుతున్నట్లు తానా మిడ్అట్లాంటిక్ విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ సతీష్ చుండ్రు తెలిపారు. మరిన్ని నగరాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు.













