TANA: తానా మిడ్ అట్లాంటిక్‌లో బ్యాక్ ప్యాక్ విజయవంతం
అమెరికా కమ్యూనిటీకీ సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో తానా(TANA) ప్రవేశపెట్టిన బ్యాక్ ప్యాక్ పథకం ప్రతి సంవత్సరం విజయవంతంగా జరుగుతోంది. ఈసారి కూడా వివిధ చోట్ల తానా నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హారీస్ బర్గ్ లో తానా మిడ్-అట్లాంటిక్ బృందం ఆధ్వర్యంలో బ్యాక్ ప్యాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పెన్సిల్వేనియా స్టీమ్ అకాడమీ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లను, పుస్తకాలను, ఇతర కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది తానా నాయకులు చేసిన సేవను ప్రశంసించారు.
తానా మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు నేతృత్వంలో, మిడ్-అట్లాంటిక్ బ్యాక్‌ప్యాక్ చైర్ రాజు గుండాల మరియు మాజీ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ చుండ్రుల మద్దతుతో నిర్వహించారు. తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఈ కార్యక్రమానికి అవసరమైన సలహాలను సూచనలను ఇచ్చి విజయవంతం అయ్యేలా చూశారు. సాంబు అంచ, శ్రీనివాస్ కోట, శ్రీనివాస్ అబ్బూరి తదితరులు కూడా ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. తానా బ్యాక్‌ప్యాక్ చైర్ కుమార్ పిచికాల ఈ సందర్భంగా మిడ్-అట్లాంటిక్ తానా బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.







