తెలుగు టైమ్స్ ఆఫీసును సందర్శించిన తానా నాయకులు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) నాయకులు హైదరాబాద్లో ఉన్న ‘తెలుగు టైమ్స్’ కార్యాలయాన్ని సందర్శించారు. అమెరికాలో తెలుగు సంఘాల వార్తలను ప్రచురిస్తూ, మొట్టమొదటి తెలుగు పత్రికగా పేరు పొందిన తెలుగు టైమ్స్ కార్యాలయాన్ని తానా నాయకులు సందర్శించి పత్రిక ప్రచురించే విధానాలను పరిశీలించి తెలుసుకున్నారు. తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు పత్రిక నిర్వహణ విషయమై వార్తలను సేకరించే విధానం, ప్రచురించే విధానాన్ని వారికి తెలియజేశారు. తానా మాజీ అధ్యక్షులు గంగాధర్ నాదెళ్ళ, సతీష్ వేమన, తానా బోర్డ్ చైర్మన్ హరీష్ కోయ, తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, తానా ట్రస్టీ జగదీష్ ప్రబల, తానా కో ఆర్డినేటర్ తెలుగు టైమ్స్ వైస్ చైర్మన్ ప్రసాద్ గారపాటి, తెలుగు టైమ్స్ న్యూస్ ఎడిటర్ గోవిందరాజన్, వెబ్ డిజైనర్ సురేష్ బాబు, ప్రింట్ డిజైనర్ సయ్యద్ జాకీర్ హుస్సేన్, సబ్ ఎడిటర్ సైదులు, తెలుగుటైమ్స్ – పాఠశాల ఆపరేషన్స్ మేనెజర్ సంధ్య, ఆఫీస్ అసిస్టెంట్లు రాజేష్, మురళీ పాల్గొన్నారు.













