తానా ప్రాంతీయ మహాసభలకు హాజరైన కేశవ్, నరేంద్ర
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఫిలడెల్ఫియాలో నిర్వహిస్తున్న ప్రాంతీయ మహాసభలకు అతిధులుగా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర హాజరయ్యారు. వారికి తానా అధ్యక్షుడు సతీశ్ వేమన ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కమ్యూనిటీకి తానా చేస్తున్న సేవలు మరువలేనివని చెప్పారు.
మహాసభల్లో భాగంగా నిర్వహించిన బాంక్వెట్కు చాలామంది తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ జే తాళ్ళూరి, తానా ట్రెజరర్ రవి పొట్లూరి, తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, లక్ష్మీదేవినేని, ఎన్ఆర్సి నాయుడు, విద్యాగారపాటి, నాగరాజు నలజుల, డిట్రాయిట్ నుంచి సునీల్ పాంత్ర, కిరణ్ చౌదరి, రవి దొడ్డపనేని, సుధాకర్ వెలగ, జో పెద్దిబోయిన, వంశీ కారుమంచి తదితరులు ఈ మహాసభలకు హాజరైన వారిలో ఉన్నారు.













