మన్నం వెంకటరమణ మృతి…తానా నాయకుల సంతాపం
న్యూజెర్సీకి చెందిన ప్రముఖుడు, తానా నాయకుడు మన్నం వెంకటరమణ గుండెపోటుతో మృతి చెందారు. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ గతవారం అమెరికా నుండి భారత్కు పయనమైన ఆయన విమానంలోనే గుండెపోటుకు గురవడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఆయన నేడు మరణించారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని కాకుటూరివారిపాలెం అనే గ్రామం నుండి ఆయన కష్టపడి అమెరికాకు వచ్చారు. మన్నం వెంకటరమణకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ఆయన మృతి పట్ల ప్రవాసులు దిగ్భ్రాంతి చెందారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రకాశం జిల్లా దర్శి నుండి 2009లో తెదేపా నుండి వెంకటరమణ పోటీ చేశారు. అమెరికాలోని పలు జాతీయ స్థాయి తెలుగు సంఘాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు. వేలాదిమందికి ఆయన అమెరికాలో ఉపాధి కల్పించారు. తానాలో ఆయన యాక్టివ్గా పనిచేసేవారు. భారత్ నుంచి అమెరికాకు వచ్చిన నిరుద్యోగులకు న్యూజెర్సీలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, తన ఉదారతను, మనసును చాటుకున్నారు. పలువురు తానా నాయకులు ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేశారు.







