AAA కన్వెన్షన్ లో తానా నాయకులకు సన్మానం
AAA మొదటి కన్వెన్షన్ లో ఫౌండర్ ప్రెసిడెంట్ హరి మోటుపల్లి మరియు ఇతర నాయకులు ఫిలడెల్ఫియా నివాసులైన తానా నాయకులు రవి పొట్లూరి మరియు వెంకట్ సింగు లను సన్మానించి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా రవి పొట్లూరి (Ravi Potluri) మాట్లాడుతూ హరి మోటుపల్లి తనకు చిరకాల మిత్రులని, రెండు సంవత్సరాల క్రితం తనను కలిసి కన్వెన్షన్ చేద్దామనుకుంటున్నామని తమ ఉద్దేశ్యం తెలిపారని, తానా అన్ని సంస్థలకు ఒక పెద్దన్న లాంటిదని, తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపానని చెప్పారు. చెప్పిన విధంగా పట్టుదలతో హరి మోటుపల్లి ఇతర అగ్ర నాయకత్వం పని చేశారని, మొదటి కన్వెన్షన్ ఘనంగా నిర్వహించారని వారందరికీ అభినందనలు తెలిపారు.







